08-03-2025 07:12:10 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మహిళా సంఘాల స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీత్తక్క, పొన్నం ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సందర్శించారు.అనంతరం మహిళా సంఘాల ఒక్కొ ఉత్పత్తుల స్టాళ్ల నిర్వహకులతో రేవంత్ రెడ్డి ముచ్చటించారు. మహిళా పెట్రోల్ బంకుల నమూనాలను పరిశీలించిన సీఎం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజుకు 15 వేలు వ్యాపారం జరుగుతుందని నిర్వాహకులు ముఖ్యమంత్రికి వివరించారు. సభ స్టేజ్ పైకి చేరుకొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ సాంస్కృతి సారధి రూపొందించిన 'ఓ మహిళ' అనే పాటను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కారించారు.