calender_icon.png 25 August, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈఏపీ సెట్ ఫలితాల్లో

12-05-2025 03:21:41 AM

వరంగల్ రెజోనెన్స్‌కు ర్యాంకుల పంట 

వరంగల్, మే 11: ఈఏపీ సెట్ 2025 ఫలితాల్లో రెజోనెన్స్ వరంగల్ ఇప్పటిలాగే అద్భుతమైన ఫలితాలతో ముందుకు దూసుకుపోయింది. ఈఏపీ సెట్ ఫలితాల్లో రెజోనెన్స్ వరంగల్ మరోసారి తన విద్యా నైపుణ్యాన్ని నిరూపించుకుంది.

రాష్ట్రస్థాయిలో రెజోనేన్స్ జూనియర్ కళాశాలకు చెందిన ఆర్. ఇక్షవర్ 265 ర్యాంకు, ఈ సాయి రోహన్ 467 వ ర్యాంకు, ఏ.నాగసాయి అనురాగ్ 806 ర్యాంక్ సాధించగా, మొత్తం 272 మంది విద్యార్థులు పదివేల కంటే తక్కువ ర్యాంకులను సాధించారని సంస్థ ప్రకటించింది. అసాధారణ విజయాన్ని సాధించిన విద్యార్థులను రెజోనెన్స్ విద్యా సంస్థ వరంగల్ చైర్మన్ లెక్కల రాజిరెడ్డి అభినందించారు.

మంచి ఫలితాలతో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. రెజొనెన్స్ వరంగల్ పోటీ పరీక్షల శిక్షణలో అత్యుత్తమ ప్రతిభకు నిలయంగా నిలుస్తూ తమ విద్యార్థుల ఉన్నత లక్ష్యాలను సాధించడానికి వారి కలలను నిజం చేయడానికి నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు.

అధ్యాపకుల అంకిత భావం విద్యార్థుల అవిశ్రాంత కృషి తల్లిదండ్రుల నిరంతర సహకారం వల్ల ఈ గర్వకారణమైన విజయం సాధ్యమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి సిఏఓ లెక్కల రమ్య రాజిరెడ్డి విద్యార్థులు అధ్యాపకులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.