calender_icon.png 13 May, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతీ పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు

12-05-2025 02:01:01 AM

  1. మిగిలిన పనులు సకాలంలో పూర్తి చేయాలి 
  2. అధికారులకు మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాలు
  3. కాళేశ్వరం వద్ద ఏర్పాట్ల పరిశీలన
  4. ఈనెల 15 నుంచి 26 వరకు పుష్కరాలు

మహదేవపూర్, మే 11: దక్షిణ కాశిగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ త్రిలిం గ క్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థాన పరిధిలో ఈ నెల 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేం దుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశించారు. ఘనంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఆదివారం జయశంకర్ భూపా లపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో వీఐపీ ఘాట్, సరస్వతి మాతా విగ్రహం, జ్ఞానతీర్థం, నదిలో భక్తుల స్నానఘట్టాలు, టెంట్ సిటీ పనులను మంత్రి పరిశీలించారు. టెంట్ సిటీలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్య మంత్రి రాక సందర్భంగా బందోబస్తుతోపాటు వివిధ అంశాలపై అధికారు లకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భం గా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని, ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీరే జవాబు చెప్పాలని అధికారులను హెచ్చరించారు. కాళేశ్వరం పట్టణాన్ని విద్యుత్ దీపాలతో ముస్తాబు చేయాలని, 12 రోజులు పండుగ వాతావర ణం కనిపించాలన్నారు. సరస్వతి మాత విగ్రహాన్ని పూలతో అందంగా అలంకరణ చేయాలని ఆదేశించారు.

పిండ ప్రధాన భవనం అసంపూర్తిగా ఉండటంపై దేవాదాయ ఇంజినీరింగ్ అధికా రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు నదిలోకి స్నానాలకు వెళ్లడానికి తాత్కాలిక రహ దారి ఏర్పాటుతో పాటు క్వియర్ మాట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులు నదిలోకి వెళ్లకుండా బారికేడ్స్, ప్రమాద హెచ్చరికల సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.

నదిలో 50 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు నాటు పడవలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. పుష్కరాల సందర్భంగా మొట్ట మొదటిసారిగా కాళేశ్వరంలో టెంట్ సిటి ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాలు సజావుగా, సక్రమంగా పకడ్బందీగా జరిగేందుకు మినిట్ టు మిని ట్  కార్యక్రమం రూపొందించుకొని కార్యాచరణ చేపట్టాలని అధికా రులను ఆదేశించా రు.

హారతి కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తారని, తదుపరి రోజుల్లో గవర్నర్, మంత్రులు వచ్చే ఆవకాశం ఉన్నందున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాల న్నారు. మహదేవపూర్ నుంచి వీధిదీపాల ఏర్పాటుతో పాటు డివైడర్ల మధ్యలో స్ట్రిప్ లైట్లు ఏర్పాటు చేయాలని, రహదారులకు మరమ్మతులు చేయాలన్నారు. తాత్కాలిక బస్టాండ్ వద్ద లైటింగ్, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. 

పారిశుద్ధ్యం చాలా ముఖ్యం

పారిశుద్ధ్యం చాలా ముఖ్యమని, కాళేశ్వ రం పట్టణం మొత్తం పరిశుభ్రంగా ఉండా లని మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. ప్రతి 30 నిమిషాలకు మరుగుదొడ్లు శుభ్రంగా చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. పనులు పర్యవేక్షణకు నియమించి న నోడల్ అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని, పనులలో నాణ్యత పాటించాలని లేదంటే చర్యలు తప్పవని మంత్రి కాం ట్రాక్టర్లను హెచ్చరించారు.

ప్రత్యేక అధికారు లు స్థానికంగా ఉండి పనులు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఒక్క నిమిషం కూడా కరెంటు పోవద్దని కాటారం, బీరసాగర్ నుంచి విద్యుత్ సరఫరా తీసుకోవాలని అన్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే సరఫరా అందించేందుకు ఆరు 125 కేవీ జనరే టర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూ చించారు. భక్తులకు ప్రతి రోజు అన్నదానం చేయాలని మంత్రి సూచించారు.

రంగులు వేసేందుకు ప్రత్యేకంగా జేఎన్టీయూ నుంచి సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మె యిన్ ఘాట్ వద్ద ఆర్చి స్లాబు వేయడం పట్ల దేవాదాయ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. భక్తులు నదిలోకి ఎలా వెళ్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

మంత్రి వెంట దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకటరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎ స్పీ కిరణ్‌ఖరే, దేవాదాయ శాఖ ఆర్జేసీ రా మకృష్ణారావు, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఏఎస్పీ కిషన్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక సింగ్, మహాదేవపూర్ బ్లా క్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజబాబు ఉన్నారు.