13-10-2025 04:33:21 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కంట్రోల్ సెంటర్ లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. విద్యార్థులకు అందుతోన్న పౌష్టిక ఆహారం, వారి ఆరోగ్య పరిస్థితులపై పీరియాడికల్ గా హెల్త్ చెకప్ లు చేయాలని సూచించారు.
హాస్టళ్లలో విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని పూర్తిగా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పరిధిలోకి తీసుకురావలని, విద్యార్థులకు అందించే భోజనం క్వాలిటీ చెక్ కు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సీఎం తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ విభాగాల పనితీరు, పథకాల అమలుపై చర్చలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు.