calender_icon.png 13 October, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయులు కాలానికనుగుణంగా బోధించాలి: ఏంఈఓ శైలజ

13-10-2025 07:03:43 PM

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): ఉపాధ్యాయులు మారుతున్న కాలానికనుగుణంగా నూతన బోధన పద్ధతులను అవలంభించాలని మండల విద్యాధికారి శైలజ అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల సాంఘిక సంక్షేమ పాఠశాల/కళాశాలలో జన్నారం, దండేపల్లి, లక్షేట్టిపేట మండలాల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సృజనత్మాకత తో కూడిన బోధన పద్ధతులు విద్యార్థులకు జీవితాంతం గుర్తు ఉంటాయని, ఉపాధ్యాయులు ఆ దిశగా ఆలోచించాలని సూచించారు. ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ లో  బోధన ప్రమాణాలు ఎంతో అవసరమని ఆమె వివరించారు.

ఏ బుక్ ఆన్ డిజిటల్ లీటరసీ గురించి మూడు రోజులు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు సమాజంలో వస్తున్నా మార్పులకనుగుణంగా తమను తాము మలచుకోవాలని హితబోధ చేశారు. గురుకుల పాఠశాలలో అన్ని సౌకర్యాలతో కూడిన కంప్యూటర్ ల్యాబ్ లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ రమ కళ్యాణి, ఎస్ ఆర్పీ లు రాజన్న, అంజన్న, ఆర్పీ లు ఏం శ్రీనివాస్,ఎన్ శ్రీనివాస్, రాజేందర్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.