calender_icon.png 13 October, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆధ్యాత్మిక ధార్మిక ప్రచార కార్యక్రమాలు

13-10-2025 07:14:44 PM

ముకరంపురా,(విజయక్రాంతి): వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆధ్యాత్మిక ధార్మిక ప్రచార కార్యక్రమంలో భాగంగా అశోక్ నగర్ మాజీ కార్పొరేటర్ బ్రహ్మశ్రీ వెంకటరమణ ఉమారాణి స్వగృహమున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి"పూజ-సత్సంగం-భజన" కార్యక్రమంను ఘనంగా నిర్వహించడం జరిగినది. విశ్వబ్రాహ్మణ వేద పండితులు బ్ర!!శ్రీ!! యాష్వాడ రాకేష్ శర్మ పూజా కార్యక్రమం నిర్వహించి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రచించిన కాళికాంబ సప్తశతకం గూర్చి బోధించారు.

గురుస్వాములు బ్రహ్మశ్రీ సిరికొండ సత్యనారాయణ  కాలజ్ఞాన ప్రవచనములు తెలియజేశారు. ముఖ్యఅతిథి  నర్సింగరావు గురు స్వామి  మాట్లాడుతూ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సబ్బండ జాతుల గురువుగా అభివర్నిస్తూ, వారి కాలజ్ఞానాన్ని , స్వామివారి రచించిన రచనలను, తత్వ బోధనలను వివరించారు. ప్రచార సమితి సభ్యులు ,  స్వామివారి భక్తులు స్వామివారి చూర్ణిక చదువుతూ,, భజనలు చేయగా, స్వామివారికి నైవేద్యం నివేదన చేసిన తదనంతరం మహిళా మణులు కర్పూర మంగళహారతులు స్వామి వారికి అందించి  తీర్థ ప్రసాదాలు స్వీకరించారు