calender_icon.png 13 October, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

13-10-2025 07:35:27 PM

చిట్యాల (విజయక్రాంతి): తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సోమవారం సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. చిట్యాల మండల పరిధిలో ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల పట్టణ కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని వారు రైతు సంఘం ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన పట్టాలను, కాంటాలు, హమాలీలను ఏర్పాటు చేసి రైతులకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఐతరాజు నరసింహ, సిపిఎం నాయకులు బొబ్బిలి వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బొడ్డు బాబురావు, చిర్రబోయిన శ్రీశైలం, బండ తిరుమలేష్, రావుల మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.