13-10-2025 07:15:58 PM
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం సీపీఐ కార్యాలయలో అపార్టీ కార్యదర్శి ఆడెపు రాజమౌళి అధ్యక్షతన దివంగత నేత గుండా మల్లేష్ 5వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో గుండా మల్లేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడారు. అమరజీవి గుండా మల్లేష్ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి భారత కమ్యూనిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగి నాలుగుసార్లు బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం అందించారు. తుది శ్వాస వరకు ప్రజలు, కార్మికుల కోసం పని చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో ఎఐటియుసి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకట్ స్వామి, మాజీ ఎంపీపీ, మల్లయ్య బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, మహిళా సమాఖ్య సీనియర్ నాయకురాలు గుండా సరోజ, జిల్లా అధ్యక్షులు బొల్లం సోని, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్, పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, డి హెచ్ పిఎస్ జిల్లా అధ్యక్షులు డిఆర్ శ్రీధర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు రత్నం రాజం, శనిగారపు రాజేందర్, స్వామి దాస్, రత్నం ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.