calender_icon.png 13 October, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి ఘనంగా పాలాభిషేకం

13-10-2025 06:59:09 PM

తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు టోనీ

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ జె (టోనీ)  ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కొనియాడారు. ఈ సందర్భంగా టోనీ మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ప్రజల త్యాగఫలితం. ఈ ప్రజా ప్రభుత్వం రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులు, కార్మికుల సంక్షేమం కోసం అనేక చరిత్రాత్మక పథకాలు ప్రవేశపెట్టింది. ప్రతి వర్గానికీ న్యాయం జరుగుతోంది” అని అన్నారు.

రైతులకు ‘రైతు భరోసా’, మహిళలకు రూ.2500 గౌరవ వేతనం, విద్యార్థులకు స్కూటీ బైక్ పథకం, నిరుద్యోగులకు రూ.2 లక్షల నిరుద్యోగ భృతి, అలాగే విద్యా భరోసా కార్డ్ వంటి పథకాలు ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. పాలాభిషేకం కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని “జై తెలంగాణ ప్రజా ప్రభుత్వం”, “జై కాంగ్రెస్ పార్టీ” నినాదాలతో మారుమోగించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, యువనాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, గ్రామ శాఖాధికారులు పాల్గొని ప్రభుత్వ పథకాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.