02-01-2026 05:43:34 PM
జిల్లా ఎస్పీ నితిక పంత్
గుండెపోటుతో మృతి చెందిన ఏఆర్‌ఎస్‌ఐ కుటుంబానికి కార్పస్ చెక్ అందజేత
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తూ ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన జగదీష్ చంద్రమండల్ కుటుంబ సభ్యులకు కార్పస్ ఫండ్, వీడో ఫండ్ కలిపి రూ.99,800 విలువ చేసే చెక్కును జిల్లా ఎస్పీ నితిక పంత్ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను కూడా తక్షణమే అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, వారి కుటుంబాలకు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ (అడ్మిన్) వామన మూర్తి, డీపీఓ బి. సూపరింటెండెంట్ రవి, జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుడు విజయ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.