calender_icon.png 7 October, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శ

07-10-2025 12:53:16 AM

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి) : ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం బెంగళూరు వెళ్లి పరామర్శించారు. ఇటీవల మల్లికార్జున ఖర్గేకు ఫేసుమేకర్‌ను వైద్యులు అమర్చిన విషయం తెలిసిందే. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం, కోర్టుల్లో విచారణ అంశంకు ఖర్గేకు సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. తిరిగి వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్నారు.