07-10-2025 12:52:55 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, అక్టోబరు 6 (విజయ క్రాంతి): జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవరణలో ఔషధ గుణాలున్న మొక్కలు నా టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను శుభ్రం చేయించాలని, ఎక్కడ చెత్తాచెదారం లేకుండా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు.
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఔషధ గుణాలున్న మొక్కలను నాటించాలని సూచించారు. సాధారణ ప్రసవాల ప్రాధాన్యతను గర్భిణీలకు వివరించాల ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రసవాలను పెంచాలని ఆదేశించారు.- బుధవారం బోధన కచ్చితంగా అమలు చేయాలి అన్ని పాఠశాలల్లోనూ బుధవారం బోధన కచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.
తిమ్మాపూర్ మండలం రామకృష్ణాపూర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. ఐదవ తరగతి విద్యా ర్థులతో ఇంగ్లీష్ పాఠం చదివించారు. రెండ వ తరగతి విద్యార్థుల కోసం అవసరమైన ఫర్నిచర్ ను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న చిన్నారులతో ముచ్చటించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు.
ఈ సందర్భంగా మా ట్లాడుతూ రామకృష్ణాపూర్ పాఠశాలలోని రీడింగ్ రూమ్ ఆకట్టుకుంటుందని, మరిన్ని పాఠశాలల్లో ఇదే మాదిరిగా గ్రంథాలయా లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటర మణ, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సనా, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో సురేందర్, ఎంఈఓ శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ ప్రిసిల్లాపాల్గొన్నారు.