calender_icon.png 23 August, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

11-12-2024 02:01:35 AM

  1. మూడు రోజులపాటు ఢిల్లీ,  జైపూర్ పర్యటన 
  2. జైపూర్‌లో బంధువుల వివాహానికి..
  3. ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమావేశం 
  4. కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం 

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడు రోజుల పాటు ఢిల్లీ, జైపూర్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 11,12,13 తేదీల్లో మూడు రోజులపాటు సీఎం పర్యటన ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి.  జైపూర్‌లోని బంధువుల వివాహ కార్యక్రమానికి కుటుంబసభ్యులతో కలిసి హాజరుకానున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి జైపూర్‌కు వెళ్తారు. సీఎం బంధు వుల వివాహానికి హాజరై తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున కేంద్ర మంత్రులు ఢిల్లీలో అందుబాటులో ఉంటారని, దీంతో పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్న ట్లు సమాచారం.

ఆయా శాఖల నుంచి వివి ధ పథకాలు, గ్రాంట్ల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తిచేసే అవకాశం ఉంది.  ఇక మూడు రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి  ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ కార్యవర్గ రూపకల్పనపై చర్చించే అవకాశం ఉందనీ అంటున్నారు.

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి , పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ కూడా ఢిల్లీలో అందుబాటులో ఉంటారు. పార్టీకి విధేయులుగా ఉండే నేతలకు కార్యనిర్వాహక అధ్య క్షులు, సీనియర్ ఉపాధ్యక్షులు పదవులు ఇవ్వాలని భావిస్తున్నారు.

ఇక పెండింగ్ పెడు తూ వస్తున్న మంత్రివర్గ విస్తరణపైనా ఈ నెలాఖరులో నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సామాజిక సమీకరణాలు కుదరకపోవడం, మంత్రి పదవులకు ఎక్కువగా పోటీ ఉండటంతో ముం దుకుపోలేని పరిస్థితులు నెలకొన్నట్లుగా పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.

నామినేటెడ్ పదవులు ఈ నెల 25 వరకు భర్తీ చేసేందుకు ఆశావాహుల పేర్లతో జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి గతంలో మొదటి విడతలో ఇచ్చిన నామినేటెడ్ పోస్టులు ఓ వర్గానికి అధికంగా ఇచ్చిన ట్లు విమర్శలు వెల్లువెత్తాయి, ఈసారి అలాం టి పరిస్థితులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీకి విధేయులుగా పనిచేసినవారికి ఏఐసీసీ, పీసీసీ నుంచి హామీలు పొందిన నాయకుల ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నారు.