10 April, 2026 | 7:04 PM

నేడు వరంగల్‌కు సీఎం రేవంత్

29-06-2024 12:05 AM

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి శనివారం వరంగల్‌కు రానున్నారు. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించనున్నారు. హనుమకొండ ఐడీవోసీలో  మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్షించనున్నారు. సాయం త్రం హనుమకొండలో మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ సీఎం పాల్గొననున్నారు.