calender_icon.png 28 December, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష

28-12-2025 01:25:46 AM

గత పదేళ్లలో నీటి 

కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై.. సభలో వివరించేందుకు 

సర్కార్ సన్నద్ధం 

హైదరాబాద్, డిసెంబర్  27 (విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగా ణకు దక్కిన వాటా, సాగునీటి ప్రాజెక్టులపైన చర్చ జరగనుంది. ఇదే అంశంపై ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి ఆదివారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సంబంధిత అధికారు లతో  సమీక్ష చేయనున్నారు. అందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు పూర్తి సమాచా రంతో సిద్ధంగా ఉండాలని ఇప్పటికే అదేశా లు జారీచేశారు.

ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన జాప్యం ఇతర అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి వివరాలపై సమీక్ష చేయనున్నారు. రాష్ట్ర విభజన తర్వాతనే కృ ష్ణానీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యా యం జరిగిందని, అందుకు కేసీఆరే కారణమని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రు లు, ఇతర నాయకులు ఆరోపిస్తున్న విష యం తెలిసిందే. సాగునీటి ప్రాజెక్టుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో ప వర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూ డా ప్రభుత్వం సిద్ధమవుతోంది.

అంతకంటే ముందే జనవరి 1న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ప్రజాభవన్‌లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంలో సర్కా ర్ విఫలమైందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ నాయకులు విమర్శలు చేయడంతో పాటు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో పోరుబాట పట్టా లని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై కేసీఆర్ వల్లే కృష్ణా నీటిలో అన్యాయం జరిగిందని అసెంబ్లీలోనే వివరించేందుకు సిద్ధమవుతున్నారు