28-12-2025 12:25:14 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ 27 : ఏఐసీసీ అగ్రనాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాం కా గాంధీ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తన గళమెత్తి ఫైర్ బ్రాండ్ అనే పేరును ఖరారు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆమె లోకసభ వేదికగా నిలదీస్తున్న తీరు అ టు ప్రజలను, ఇటు అఖిల పక్ష నాయకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
క్లిష్ట సమ యాల్లో కూడా ఎంతో నిబ్బరంగా ఉంటూ ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోవడం కాంగ్రె స్ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపుతోంది. తన తల్లి, దివంగత ప్రధాని ఇందిరా గాంధీని తలపించేలా ఆమె రూపం ఉండటం, తల్లి తరహాలోనే హుందాతనం కలిగి ఉండటం ఆమెకు అదనపు ఆకర్షణ. ఆమె వాక్పటిమకు సొంత పార్టీ నేతలే కాకుండా ఇతర పార్టీల నేతలు కూడా మంత్ర ముగ్ధులవుతున్నారు. ఆమె ప్రజలతో మమేకమయ్యే తీరు, నిష్కపటమైన మాట తీరు ఆమెను ఒక ప్రజా నాయకురాలిగా నిలబెడుతున్నాయి.
రాజకీయాల్లో ఆమె ప్రదర్శిస్తున్న ధైర్యం, సాహసం పార్టీలో ఆమెను ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నాయి. అది ఏ స్థాయికి చేరిందంటే.. రాహుల్ కంటే ప్రియాంకదే అప్పర్ హ్యాండ్.. అని కొందరు సాంత నేతలు చెవులు కొరుక్కునే స్థాయికి చేరింది. క్షేత్రస్థాయిలో ఆమె సమస్యలను పరిష్కరించే ‘ట్ర బుల్ షూటర్’గా ఎదుగుతున్నారు. ము ఖ్యంగా పార్లమెంటు లో ప్రియాంక గాంధీ ప్రదర్శన ఆమె గ్రాఫ్ ను ఒక్కసారిగా పెంచేసింది. వందేమాతరం వివాదం, ఉపాధి హామీ చట్టం మార్పులపై ఆమె చేసిన ప్రసంగాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అ య్యాయి.
ప్రధాని మోదీపై ఆమె సంధించిన విమర్శలు వ్యక్తిగత దూషణలకు తావు లేకుండా, లోతైన విశ్లేషణతో ఉండటం అం దరినీ ఆకట్టుకుంది. ప్రియాం క అధికార పక్ష నేతలతోనూ మర్యాదపూర్వక సంబంధా లు కొనసాగిస్తూ తన రాజకీయ పరిణతిని చాటుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పుపై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ము ఖ్యంగా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రియాంక గాంధీ ప్రసంగాలు, వ్యవహార శైలి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇది కాస్తా పార్టీలో ‘రాహుల్ వర్సెస్ ప్రియాంక’ అనే కొత్త కోణానికి దారితీస్తోంది. రాహుల్ గాంధీ దూకుడుగా వ్యవహరిస్తుంటే, ప్రియాంక మాత్రం హుందాతనంతో కూడిన వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకుంటున్నారు.
సొంత పార్టీ నేతల నుంచి మద్దతు
సొంత పార్టీ నేతల నుంచే ప్రియాంకకు మద్దతు పెరుగుతోంది. సహరాన్పూర్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ చేసిన వ్యాఖ్యలు రాజకీ య వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ, ప్రి యాంకను ప్రధానిని చేస్తే ఇందిరా గాంధీలా గట్టి సమాధానం చెబుతారని వ్యా ఖ్యానించారు.
మరోవైపు ఒడిశాకు చెందిన సీనియర్ నేత మహమ్మద్ మోకిమ్ ఆమెకు కీలక బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ చేసి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ప్రియాంక గాంధీలో ఇందిరా గాంధీ పోలికలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతుండడం గమనార్హం. రాహుల్ సిద్ధాంతపరమైన పోరాటం చేస్తుంటే, ప్రియాంక మాత్రం క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించే నేతగా ఎదుగుతున్నారనే బ్రాండ్ ఆమె సాధించారు.
చర్చనీయాంశంగా రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు
భవిష్యత్తులో తన భార్య, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భారత ప్రధాని కావడం ఖాయమని ఆమె భర్త రాబర్ట్ వాద్రా ధీరజం ఇటీవల చేసిన వ్యాఖ్య లు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. రాజకీయాల్లో ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, దేశంలో అవసరమైన మార్పులను తీసుకురావడానికి ఆమె సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రి యాంక తన నాయకత్వ లక్షణాలను తన నాయనమ్మ ఇందిరా గాంధీ, తం డ్రి, తల్లి నుంచి పుణికిపుచ్చుకున్నారని వాద్రా వివరించారు. ఎంపీ ఇమ్రాన్ మసూద్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రాబర్ట్ వాద్రా తన వివరణలో చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.