28-12-2025 01:22:30 AM
రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ
సికింద్రాబాద్ డిసెంబర్ 27 (విజయక్రాంతి) : ఘట్కేసర్ - బీబీనగర్ సెక్షన్లోని లెవెల్ క్రాసింగ్ గేట్లను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ శుక్రవారం అర్దరాత్రిపూట ఆకస్మిక తని ఖీలు చేపట్టారు. ఇందులోభాగంగా ఆయన లెవెల్ క్రాసింగ్ గేట్ నంబర్లు 17, 20, నైట్ పెట్రోల్ మ్యాన్ కు కేటాయించబడిన వర్కింగ్ బీట్ను కూడా తనిఖీ చేశారు.
భారతీయ రైల్వేలోని గేట్మెన్లు రైళ్లు, రోడ్డు ట్రాఫిక్ రెండింటికీ సురక్షితమైన ప్రయాణాన్నిఅందించడానికి గాను గేట్లను ఆపరేట్ చేయడం, సిగ్నల్లను ప్రదర్శించడం, స్టేషన్ మాస్టర్లతో కమ్యూనికేట్ చేయడం, అడ్డంకుల నుండి ట్రాక్ను రక్షించడం,రోడ్డు ట్రాఫిక్ ప్రవాహంతో రైళ్ల కదలికలను సమన్వయం చేయ డం ద్వారా ప్రమాదాలను నివారించడమే ఉద్యోగుల ప్రధాన లక్ష్యం. ఇందుకు గాను నిరంతరం అప్రమత్తంగా ఉండటం, డ్యూటీ రోస్టర్లకు కట్టుబడి ఉండటం, సిగ్నలింగ్ నియమాల పరిజ్ఞానం అవసరం. భారతీయ రైల్వేలో నైట్ పెట్రోలింగ్లో ట్రాక్మెన్ డ్యూటీ రాత్రి 10 గంటలకు మొదలై ఉదయం 6 గంటల వరకు ఉంటుంది.
ఈ డ్యూటీ సమయంలో ట్రాక్ వెంబడి నడవడం, రైలు పట్టాల పగుళ్లు, రైలు పట్టాలు కొట్టుకుపోవడం లేదా విధ్వంసం వంటి లోపాలను గుర్తించడం, అనూహ్య సంఘటనలు జరిగిన వెంటనే రైలు సిబ్బందిని అప్రమత్తం చేయ డం ద్వారా భద్రతను పెంపొందించడం, ప్రమాదాలను నివారించడానికి రైళ్లను ఆపడం కోసం జెండా ఊపడం వంటి రక్షణ చర్యలు తీసుకోవడం తో పాటు ముఖ్యంగా వర్షా, కాలం శీతాకాలంలో వంతెనలు, సొరంగాలు, క్లిష్టమైన పాయింట్లను తనిఖీ చేయడం వంటి క్లిష్టమైన విధులు నిర్వహిస్తారు.
విధి నిర్వహణలో గేట్ మాన్ నైట్ పెట్రోల్ మాన్ అప్రమత్తతను తనిఖీ చేయడానికి రైళ్లను సురక్షితంగా నడపడంలో వారి కీలక పాత్రను పరిగణన లోకి తీసుకుని రోడ్డు ద్వారా ప్రయాణాన్ని ప్రారంభించి, ఆకస్మిత తనిఖీలో భాగంగా మొదటగా, ఘట్కేసర్ - బీబీనగర్ సెక్షన్లోని లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 17, తరువాత లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 20ఈ కి చేరుకున్నారు. రెండు గేట్ల వద్ద గేట్మెన్లతో సంభాషించి పని చేసే తీరును సమీక్షించారు. గేట్ బూమ్ పనితీరును, రికార్డుల నిర్వహణ, భద్రతా పరికరాలను సరిగ్గా నిర్వహించే విధానాన్ని ఆయన తనిఖీ చేశారు. తరువాత ఆయన గేట్మ్యాన్లతో భద్రతా పని విధానం, భద్రతా నియమాల పట్ల వారికున్నఅవగాహన, జ్ఞానం, సురక్షిత పని నియమాల గురించి సంభాషించారు.
అనంతరం ఆయన నైట్ పెట్రోల్మ్యాన్.ట్రాక్ మాన్ ఉద్యోగులతో సమావేశమై వారి విధులు, ఇబ్బందులు వారు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చర్చించారు. పెట్రోలింగ్ సిబ్బంది వద్ద ఉన్న పరికరాలను తనిఖీ చేసి,అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా అడిగి తెలుసు కున్నారు. తనిఖీ పూర్తయిన తర్వాత, జనరల్ మేనేజర్ తమ విధులకు అంకితభావంతో పనిచేస్తూ, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉన్నగేట్మ్యా న్కు, పెట్రోల్ మ్యాన్కు నగదు బహుమతిని ప్రకటించారు. ఈ ఆకస్మిక తనిఖీలో ఆయనతో పాటు సికింద్రాబాద్ డివిజన్ డివిజ నల్ రైల్వే మేనేజర్ డాక్టర్ గోపాల కృష్ణన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.