calender_icon.png 28 December, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిస్వార్థ సేవకు నిదర్శనం ఎన్‌ఆర్‌ఆర్

28-12-2025 12:09:54 AM

మహబూబాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): నిస్వార్ధ సేవకు నిలువెత్తు నిదర్శ నంగా దివంగత మాజీ మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు నూకల రామచంద్రారెడ్డి (ఎన్‌ఆర్‌ఆర్) నిలుస్తారని, ప్రస్తుత రాజకీయ నేతలు ఆయన్ని స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని శనివారం మంత్రి పొంగులేటి ఆవిష్కరించి, మాట్లాడారు. నూకల రామచంద్రారెడ్డి దివంగతులై 50 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ ఆయన పేరును స్మరిస్తున్నారంటే ఆయన అప్పట్లో చేసిన ప్రజాసేవ ఎంతో అమోఘమైనదిగా పేర్కొన్నారు. 

ఈ ప్రాంత లంబాడి తెగకు రిజర్వేషన్లు అమలు చేయడానికి చేసిన కృషి మరువలేనిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో దాదాపు అందరి మంత్రివర్గంలో మంత్రిగా విధులు నిర్వహించిన రామచంద్రరెడ్డి ఏనా డు కూడా తన స్వప్రయోజనాల కోసం పనిచేయలేదని, పూర్తిగా తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారని కొనియాడారు. ధనిక భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ ప్రజా సేవకే తన జీవితాన్ని ధారపోసారని కొనియాడారు.

కాగా అంతకుముందు మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గా ల్లో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిం చా రు. ఆయా కార్యక్రమాల్లో సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్, మహబూబాబాద్, ఖమ్మం  ఎంపీలు పోరిక బల రాం నాయక్, రఘురామిరెడ్డి, విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ భూక్యా మురళి నాయక్, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ లు తక్కల్లపల్లి రవీంద ర్రావు, బసవరాజు సారయ్య, ట్రై కార్ చైర్మన్ బెల్లయ్య నాయక్,  మాజీ ఎంపీలు సురేందర్‌రెడ్డి, సీతారాం నాయక్, వినోద్ కుమార్, డీసీసీ మాజీ అ ధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, రామచంద్రరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.