calender_icon.png 14 September, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య రంగంలో అత్యాధునిక స్క్రీనింగ్ టెక్నాలజీ

14-09-2025 12:22:10 AM

ముషీరాబాద్, సెప్టెంబర్13 (విజయక్రాంతి): హెల్త్ కేర్ టెక్నాలజీలో అగ్రగామి సంస్థ అయిన ఫ్యుజిఫిల్మ్ ఇండియా సంస్థ విశ్వం డయాగ్నస్టిక్స్ సెంటర్లో తమ అత్యాధునిక అమ్యులెట్ ఇన్నోవాలిటీ ఫుల్ ఫీల్ డిజిటల్ మమ్మోగ్రఫీ(ఎఫ్‌ఎఫ్‌ఎఎం) వ్యవస్థను తీసుకొచ్చినట్లు విశ్వం డయాగ్నస్టిక్స్ సెంటర్ ఎండీ డా.రాసా విజయ్ శనివారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫ్యూజిఫిల్మ్ ఇండియా మెడికల్ సిస్టమ్స్ డివిజన్ బిజినెస్ ఎడ్వైజర్ షున్సుకె హోండాతో కలసి ఆయన మాట్లాడుతూ ఈ భాగస్వామ్యంతో అంతర్జాతీయ స్థాయి రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలను తీసుకు రాగలిగామని అన్నారు.