calender_icon.png 13 November, 2025 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల ఆరోగ్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్

13-11-2025 05:03:53 PM

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ..

కామారెడ్డి (విజయక్రాంతి): పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్ పథకం కలిపిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ఆయన పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఇబ్బందులపడి అప్పుల పాలైన వారికి ఈ ఆర్థిక సాయం కొంత ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్ర కరణ్ రెడ్డి, మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి, ఐరేని సందీప్ కుమార్, పుట్నాల శ్రీనివాస్ యాదవ్, కోయల్ కర్ కన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.