calender_icon.png 13 November, 2025 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులకు జెర్సీలు పంపిణీ

13-11-2025 06:28:03 PM

మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీల కు ఎంపికైన జిల్లా క్రీడాకారుల కు పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బేర వేణుగోపాల రావు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14, 15, 16 తేదీల్లో నల్లగొండ జిల్లాలో జరుగనున్న ఫుట్ బాల్ పోటీ ల్లో పాల్గొననున్న అండర్ 17 క్రీడా కారులకు తమ కూతుళ్లు బేర నిర్మిత, బేర మేనిత ల కోరిక మేరకు క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఆశయంతో వారికి జెర్సీలు అందించడం జరిగిందన్నారు. క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరచి క్రీడల్లో రాణించి జిల్లాకు పతకాన్ని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్  రాజయ్య, రమేష్, కోచ్ గాలి పెళ్లి సురేందర్ లు పాల్గొన్నారు.