16-09-2025 12:00:00 AM
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్
ఎల్బీనగర్, సెప్టెంబర్ 14 : పేదలకు వైద్యచికిత్స సమయంలో సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీ, టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కొత్తపేటలో బాధిత కుమారుడు మనీష్ కు ఆదివారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రూ, 2 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును అందజేశారు.
కొత్తపేట డివిజన్ నాగేశ్వరరావు కాలనీలో నివాసం ఉండే భాస్కర్ రావు కడుపులో గడ్డలకు సంబంధించిన సమస్యలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆర్థికసాయం కోసం కుటుంబసభ్యులు ఎమ్మెల్యేను సంప్రదించారు. ఆయన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు చేయించారు. ఈ మేరకు బాధితుడి కుటుంబ సభ్యులకు రూ, 2 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ ఎల్వోసీ చెక్కు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ప్రతిక్, సింగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..
సీఎం రిలీఫ్ ఫండ్ ఆపద సమయంలో ఎంతోమంది పేదలు ఆర్థికంగా ఉపశమనం పొందగలుగుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అన్నారు. అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించారు.
వనస్థలిపురానికి చెందిన పారంద పావని (రూ. 21వేలు), వియ్యపు సాంబశివరావు ( రూ. 21వేలు), ఉడుముల సుధాకర్ రెడ్డి (రూ.60వేలు), ఎల్బీనగర్ కు చెందిన చౌకత్ సురేశ్ (రూ. 60వేలు), దిల్ షుక్ నగర్ చెందిన సిరందాసు శ్రీదేవి (రూ.58,500), కర్మన్ ఘాట్ కి చెందిన జి.సతీష్ (రూ. 23వేలు), వనస్థలిపురానికి చెందిన సిర్సుల్లా రాకేశ్ (60వేలు), హయత్ నగర్ కు చెందిన లింగం శ్రీశైలం (30వేలు) తదితరులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వనస్థలిపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందజేశారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, వేణుగోపాల్ యాదవ్, చెన్నగోని రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, నేలపాటి రామారావు, నాయకులు బోడ రాజశేఖర్, విజయ భాస్కర్ రెడ్డి, కొండూజు శ్రీనివాస్, రమేశ్, దాసరమోని శ్రీనివాస్, శరత్ యాదవ్ పాల్గొన్నారు.