15-09-2025 12:03:54 AM
సురక్షితంగా బైటకు తీసిన గజ ఈతగాళ్ళు
అదిలాబాద్,(విజయక్రాంతి): తెలంగా ణ రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతాల్లో ఒకటైన ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతాలు చిక్కుకున్న ఇద్దరిని పోలీసులు రక్షించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతం సోయగాలను తిలకించేందుకు పర్యాటకుల తాకిడి పెరిగింది. దింతో ఆదివారం సెలవు దినం కావడంతో జలపాతానికి పర్యాటకులు పెద్దఎత్తున తరలివచ్చారు. కాగా జలపాతాన్ని తిలకించేందుకు వచ్చిన నేరడిగొండ మండలంలోని పర్యాటకులు ఇద్దరు ఇష్మాయిల్ ఖాన్, షేక్ జమాయిల్ లు జలపాతం లో చిక్కుకున్నారని స్థానికులు తెలపడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో జలపాతంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు రక్షించారు.