23-08-2025 12:55:50 AM
జూట మాటలకు పెట్టిన పేరే మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే...
బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం మాజీ ఎమ్మెల్యే షిండే నిన్న కౌలాస్ ప్రాజెక్ట్,నిజాం సాగర్ ప్రాజెక్ట్ కు సందర్శించి మొసలి కన్నీరు , జూటా మాటలు నీతి వాక్యాలు చెబు తున్నారు. జూటా మాటలు కు పెట్టిన పేరే హనుమంత్ షిండే..వంద ఎలుకలు తిన్న పిల్లి.. కాశీకి పోయి పాపాలు కడుకున్నది అంట... గత 10 సంవత్సరాలలో ప్రజలకు కష్టాలు వస్తే కనబడని హన్మంత్ షిండే ..మీరు నీతి మాటలు మాట్లాడేదా...ఇదే షెట్లూర్ గ్రామం మంజీరా వాగులో నీట మునిగి చనిపోతే కనీసం సంఘటన స్థలానికి రాని నువ్వు ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నావా అన్ని శుక్రవారం మీడియా సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్, యువజన నాయకుడు విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ... మీరు గతం లో ఇంజనీర్ గా పని చేశారు.
కదా.. మీకు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు..నాయకులు వచ్చేంత వరకు వేచి ఉండే ఆలోచన ఉండేది కాబట్టి మీరు అలా చెబుతున్నారు. మా నాయకుడు ప్రాజెక్టు స్థితి గతులు ,వరద ప్రభావం ఎంత వరకు ఉంది ఏదైనా ప్రమాదం ఉందా అని ఎప్పటి అప్పుడు పర్యవేక్షిస్తూ సూచనలు మాత్రమే జారీ చేసిండు..నేను వచ్చేంత వరకు గేట్లు ఓపెన్ చేయద్దు..అని అనలేదు ఏ రోజు కూడా అనడు..మీరు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీళ్ళు వదలాల్సి వస్తె పక్క నియోజక వర్గం ఎమ్మెల్యే వచ్చేంత వరకు వేచి చూసే మీరు..మా నాయకుడు గురించి మాట్లాడేదా...మా నాయకుడు అధికారులకు పూర్తి స్వేచ్ఛ ను ఇచ్చాడు..మా నాయకుడు అధికారులకు పూర్తి నిబద్ధత తో ప్రజల కొరకు ఎప్పుడూ అందు బాటులో ఉండే విధంగా పని చేయాలి
అని పూర్తి గా స్వేచ్ఛ నిచ్చెన నాయకుడు మా ఎమ్మెల్యే కాంతారావు వరద ప్రభావం తో పంటలు దెబ్బతింటే వెళ్లి పంట నష్టము చూసిన దాఖలాలు కూడా లేవు....పంట నష్టం ను చూసి అధికారులకు పంట నష్టం అంచనా వేసి పంట నష్ట పరిహారం ఇప్పించే పని లో మా నాయకుడు ఉన్నాడు. మీరు గతం లో ఎప్పుడైనా పంట నష్టం పరిహారం ఇచ్చారా...మా నాయకుడు వరద ప్రవాహం లో కూడా ప్రజలలో ఉండి ప్రజల కష్ట సుఖాలు పంచుకుంటూ ఉంటే మీరు ప్రతిపక్ష నాయకుడు గా ప్రజలలో ఉండాల్సిన మీరు హైదరాబాద్ లో పడుకొన్నారు మా నాయకుడు గురించ మీరు మాట్లాడేది..
656 గొర్రెలు ,3 గొర్రె కాపరుల ను కాపాడడానికి మా నాయకుడు జిల్లా యంత్రాంగ ను సంఘటన స్థలానికి రప్పించి తన పాత్రను పూర్తిగా నిబద్ధతతో పోషించిన మా నాయకుడు గురించ నువ్వు మాట్లాడేది...నీ బి ఆర్ స్ మాజీ సర్పంచ్ లను, బి ఆర్ స్ నాయకులను అడుగు మా నాయకుడు చేసినకష్టము,జిల్లా అధికార యంత్రాంగం పని చేసిన విధానము. మీరు హైదరాబాద్ లో పడుకొని అంత సవ్యంగా జరిగిన తరువాత మీరు నీతి వాక్యాలు మాట్లాడటం విడ్డూరంగా ఉదన్నారు. ఇప్పటికైన ఇటువంటి అబద్ధపు వాక్యాలు మానుకోవాలని యువజన కాంగ్రెస్ తరుపున హెచ్చరిస్తున్నాము.