calender_icon.png 29 August, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేద ప్రజలకు వరం

15-05-2025 01:45:25 PM

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): సీఎం ఆర్ ఎఫ్ పథకం  నిరుపేద ప్రజలకు వరం లాంటిదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో వివిధ అనారోగ్యా కారణాల రిత్య  వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 37 మందికి 14 లక్షల 66 వేల 500 రూపాయల సీఎంఆర్ఎఫ్  చెక్కులను  పంపిణీ చేసి మాట్లాడారు.ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సంవత్సరానికి దాదాపు 1000 కోట్లకు పైన రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ నిరుపేదలకు ఆసరాగా నిలుస్తుందన్నారు.