calender_icon.png 23 August, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు సీఎంఆర్‌ఎఫ్ ఆసరా

14-03-2025 12:42:39 AM

 టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్

ఎల్బీనగర్, మార్చి 13 : పేదలకు సీఎంఆర్‌ఎఫ్ ఆసరా ఉంటుందని, సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థికంగా ఉపశమనం లభిస్తుందని, ప్రవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సామాన్యు లకు వైద్యభారం తగ్గు తుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు.

అనారోగ్యంతో  ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన వనస్థలిపురానికి చెందిన భవిరిశెట్టి జ్యోతి అనారోగ్యంతో ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందుల రీత్యా కాంగ్రెస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు కుట్ల నర్సింహ యాదవ్ సహకారంతో మధుయాష్కీని సంప్రదించారు. 

ఆయన వెంటనే స్పందించిన రూ .60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించారు. ఈ మేరకు చెక్కును గురువారం జ్యోతి కుటుంబ సభ్యులకు  అందజేశారు.  కార్యక్రమంలో నాయకులు కుట్ల నర్సింహ యాదవ్, నరేశ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.