14-03-2025 12:40:31 AM
నారాయణపేట. మార్చి 13 (విజయ క్రాంతి): నారాయణ పేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో నారాయణ పేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ, కోస్గి రోడ్డు విస్తరణ పనులపై కలెక్టర్ రెవెన్యూ, నీటి పారుదల శాఖ, ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలోని మక్తల్, నారాయణ పేట నియోజక వర్గాలలో భూసేకరణ ప్రక్రియను అధికారులు సమన్వయంతో చేపట్టాలన్నారు.
భూసేకరణ ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని ఆమె అడిగారు. జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్ స్పందిస్తూ.. జిల్లాలోని మక్తల్, నారాయణ పేట నియోజక వర్గాల పరిధిలో మొత్తం 21 గ్రామాలలో 556 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉందని, ఇప్పటి వరకు 16 గ్రామాలలో భూసేకరణ గాను ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని తెలిపారు. అయితే ఆ 16 గ్రామాలకు సంబంధించి మొత్తం 379.07 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందన్నారు. మిగతా 5 గ్రామాలలో భూసేకరణ ప్రాసెస్ లో ఉందని ఆర్డీవో రాంచందర్ నాయక్ తెలిపారు.
అంతకుముందు కోస్గి రోడ్డు విస్తరణ పనులు ఎంతవరకు వచ్చాయని జిల్లా కలెక్టర్ ప్రశ్నించగా కోస్గి పట్టణంలో మొత్తం 228 వ్యాపార, నివాస గృహాలు విస్తరణ లో పోతున్నాయని, వాటిలో 139 సొంత స్థలాలు, 89 ఖాళీ స్థలాలు ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ నాగరాజు తెలిపారు. వీరిలో కొంతమంది కోర్టును ఆశ్రయించారని చెప్పారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కోస్గి రోడ్డు విస్తరణ పనులను ఎలాంటి వివాదాలు లేకుండా అర్హతను బట్టి నష్ట పరిహారం చెల్లించి ముందుకు వెళ్లాలని అవసరమైతే న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల, ఆర్డీవో రామచందర్ నాయక్, ఆర్ అండ్ బి డీ ఈ రాములు, పిఆర్ ఈ ఈ హీర్యా నాయక్, ఇరిగేషన్ ఈ ఈలు ఉదయ్ శంకర్, బ్రహ్మానందం, డి ఈ ఈ లు సతీష్, సురేష్, కోస్గి తహా సిల్దార్ బక్క శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, భూసేకరణ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
రానున్న తీవ్ర ఎండాకాలంలో వడదెబ్బ సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచిం చారు గురువారం నారాయణపేట జిల్లా కలెక్టర్ విసి హాల్లో వాతావరణం మార్పులు వేసవికాలం ఎండ తీవ్రత వడదెబ్బ తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఎండాకాలంలో ప్రతి ఒక్కరు ప్రయాణాలలో త్రాగు నీరు వెంట తీసుకెళ్లాలన్నారు. ఎండ తగలకుండా తగు జాగ్రత్త తీసుకోవాలన్నారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని ఐఎండి సూచనలు పాటించాలన్నారు. ముఖ్యంగా చిన్నారులు మహిళలు వృద్ధులు గర్భిణీలు ఎండ పట్ల తగు జాగ్రత్త వహించాలన్నారు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఉపయోగించాలని నిమ్మరసం మజ్జిగ పండ్ల రసాలు వంటి ఇంట్లో తయారు చేసిన పానీయాలు కొద్దిగా ఉప్పు కలిపి త్రాగాలన్నారు.
పుచ్చకాయ, కర్బూజా, ఆరెంజ్, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ, పాలకూర లేదా ఇతర స్థానికంగా లభించే పండ్లు కూరగాయలు వంటి అధిక నీటి పరిమాణం గల సీజనల్ పండ్లు కూరగాయలు తినాలన్నారు. సన్నని వదులుగా లేత రంగులో ఉండే కాటన్ వస్త్రాలను ధరించాలని తలను కప్పుకోవాలని సూర్య రష్మి తగలకుండా గొడుగు టోపీ టవల్ వాడాలన్నారు. అనారోగ్యంగా భావిస్తే విపరీతమైన వేడి సమయంలో చల్లని ప్రదేశానికి వెళ్లి ద్రవపదార్థాలు తాగాలి. వడదెబ్బ అనేది మెడికల్ ఎమర్జెన్సీ కావున అయోమయం గందరగోళం ఆందోళన చిరాకు మూర్ఛ లేదా కోమ వంటివి పెద్దలలో కలుగుతాయని, శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల వరకు ఉండి తలనొప్పి ఆందోళన, వికారం, వాంతులు, హృదయ స్పంద న పెరగడం వంటివి కలుగుతాయన్నారు.
కూలీలు పని ప్రదేశంలో చల్లని త్రాగునీటిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్మికులు నేరుగా సూర్య రష్మికి గురికాకుండా జాగ్రత్త వహించాలన్నారు. కార్మికులకు కూలీలకు షెడ్డు ఏరియాలో ఏర్పాటు చేయాలన్నారు. మీ ఇంటిని చల్లగా ఉంచండి షెటర్లు లేదా చలువ పందిల్ల ను ఉపయోగించండి. రాత్రివేళ కిటికీలను తెరవాలి. పగటిపూట దిగువ అంతస్తుల లో ఉండడానికి ప్రయత్నించాలని శరీరాన్ని చల్లబరచటానికి ఫ్యాన్, తడి బట్టలను ఉపయోగించాలన్నారు. ముఖ్యం గా మధ్యాహ్నం 12 నుండి మూడు గంటల వరకు ఎండలో బయటకు రాకూడదనీ ఇలాంటి జాగ్రత్తలు వేసవిలో తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం దీనికి సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైని కలెక్టర్ గారిమా నరుల, డి. ఎం. హచ్. ఓ. సౌభాగ్య లక్ష్మి తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు.