02-11-2025 10:18:20 PM
యాదగిరిగుట్ట (విజయక్రాంతి): ప్రముఖ తెలంగాణ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొబ్బరికాయల వ్యాపారులు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. 30 రూపాయల కొబ్బరికాయలను వంద రూపాయలకు విక్రయిస్తున్నారు. దీనిపై ఆలయ అధికారులు ఎలాంటి స్పందన లేదు. భక్తులను యథేచ్ఛగా నిలువు దోపిడీ చేస్తూ దేవాలయం సన్నిధిలో సిండికేట్ వ్యాపారం కొనసాగిస్తున్నారు. దీనిపై ఆలయ అధికారులు ఎందుకు స్పందించడం లేదు, ఇన్ని రోజులు ఎవరు కూడా ఎందుకు దీనిపై ఎదురు తిరగలేదు, అనే అంశంపై అనేక అనుమానాలు రేకుత్తుతున్నాయి.