calender_icon.png 3 November, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం అభివృద్ధికి 10 కోట్లు నిధులు మంజూరు జీఓ విడుదల

02-11-2025 10:15:16 PM

సంగారెడ్డి (విజయక్రాంతి): సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జిఓ విడుదల చేసింది. క్రీడల అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక క్రీడాభిమానుల్లో ఆనందం నింపింది. ఈ నిధులతో స్టేడియంలో ఇండోర్ సౌకర్యాలు, సైనాథటిక్ కోర్టులు, బాస్కెట్‌బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, హాండ్‌బాల్ వంటి క్రీడల కోసం ఆధునిక మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. అదనంగా వాకింగ్ ట్రాక్, లైటింగ్, అథ్లెటిక్స్ ట్రాక్‌ వంటి సదుపాయాలు కల్పించబడనున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విజ్ఞప్తికి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి రూ.10 కోట్లు మంజూరు చేయడంపై తెలంగాణ మౌలిక సదుపాయాల కల్పన చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూలకంటి ఆంజనేయులు, కూన సంతోష్ తదితరులు పాల్గొన్నారు.