calender_icon.png 23 January, 2026 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాయు నాణ్యత పెంపునకు సమష్టి కృషి

23-01-2026 12:22:25 AM

అదనపు కమిషనర్ రఘు ప్రసాద్

హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 22 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించి, గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం అమలును వేగవంతం చేసే చర్యల్లో భాగం గా సిటీ లెవల్ మానిటరింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ప్రత్యేక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఆయన నగరంలో గాలి కాలుష్య నియంత్రణకు సంబం ధించి వివిధ విభాగాల పనితీరును కూలం కషంగా సమీక్షించారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాయు నాణ్యత పరిస్థితులను, కాలుష్య హాట్స్పాట్లను అత్యధిక కాలుష్యం ఉన్న ప్రాంతాలు అధికారులు విశ్లేషించారు. స్వచ్ఛమైన గాలిని ప్రజలకు అందించడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్డబ్ల్యూఎం  విభాగం అధికారులు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ టెక్నికల్ కన్సల్టెంట్ సుధాకర్ డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.