23-01-2026 12:22:19 AM
ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్ రూరల్ జనవరి 22: ఉద్యమ ముసుగులో గద్దెనెక్కిన గత ప్రభుత్వం బిఆర్‌ఎస్ ప్రజలకిచ్చిన హామీల మాదిరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు ప్రజలను మోసం చేయలేదని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మహిళలకు ఇందిరా మహిళా శక్తి సంబరాలో మహిళా సంఘాలకు కొల్లాపూర్ మున్సిపాలిటీకి 62 సంఘాలకు 10 కోట్ల రుణాలు 153 సంఘాలకు వ ద్దులేని రుణాలు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత నాయకుల లాగా ఎన్నికల ముందు బోగస్ హామీలు ఏరోజు ఇవ్వలేదన్నారు. కొత్తగా 50 కోట్లతో నా ర్లాపూర్. సోమశిల. అమరగిరి మల్లేశ్వరంలో టూరిజం డెవలప్ చేస్తున్నామన్నారు. కార్యక్రమం లో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ భదావత్ సంతోష్ .కొల్లాపూర్ ఆర్డీవో బౌన్స్ లాల్. ఎమ్మార్వో భరత్ కుమార్ .డిఎస్పి శ్రీనివాసులు. అధికారులు మహిళా సంఘాల ఏజెంట్లు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.