calender_icon.png 31 October, 2025 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులపై కలెక్టర్, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమీక్ష

31-10-2025 12:03:45 AM

బిచ్కుంద, అక్టోబర్ 30 (విజయ క్రాంతి):  కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి మరియు అన్ని శాఖల అధికారులతో గురువారం సుధీర్ఘ చర్చల్లో  జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  పాల్గొన్నారు..జుక్కల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనులు,సమస్యలు మరియుపేదలకు అందుతున్న ప్రభుత్వ పథకాల గురించి చర్చించారు.

పనులు వేగవంతం చేయాలని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించే దిశగా కృషి చేయాలని సూచించారు..ముఖ్యంగా ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నది తన ఆశయం అని, దానికి అధికారులు అందరూ సహకరించి నిబద్ధతో పనిచేయాలనికోరారు.నియోజకవర్గంలో విద్యా, వైద్య వ్యవస్థలను మెరుగుపర్చాలని,దానికిఅనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు..పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడంలో రాజీపడబోమని తెలిపారు..