31-10-2025 02:04:03 PM
 
							అచ్చంపేట: తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్- శ్రీశైలం(Hyderabad-Srisailam National Highway) మార్గంలోని డిండి సమీపంలోని 765 జాతీయ రహదారి భారీగా కోతకు గురైన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ నుంచి అచ్చంపేట, శ్రీశైలం వెళ్లే వాహనాలను కొండారెడ్డిపల్లి, ఉప్పునుంతల, హాజీపూర్ మీదుగా దారి మళ్లిస్తున్నారు. వాహనాల ప్రతిని దృష్టిలో ఉంచుకొని జాతీయ రహదారి నిర్వాహకులు కోతకు గురైన రహదారికి మరమ్మతు పనులను ప్రారంభించారు. నీటి ఉదృత్తో కొట్టుకుపోయిన రోడ్డుపై మొరం, కంకరతో ఆ మార్గాన్ని పునర్దించే పనులను చేపట్టారు. పనులు దాదాపుగా పూర్తికా వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. అతి త్వరలోనే వాహనాల రాకపోకలకు అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.