calender_icon.png 31 October, 2025 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెగా రక్తదాన శిబిరం

31-10-2025 12:04:03 AM

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహణ

హైదరాబాద్, అక్టోబర్ 30(విజయక్రాంతి) : పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గురువారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోన వైష్ణవి గార్డెన్స్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. గురునానక్ విద్యా సంస్థల విద్యార్థులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు.

గురునానక్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు, చైర్మన్ రవీందర్ సింగ్ కోహ్లీ మూడో వర్థంతిని పురస్కరించుకొని ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఆయనకు పలువురు నివాళులర్పించారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కేపీవీ రాజు  స్వీయ పర్యవేక్షణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భం గా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం యువతలో సామాజిక బాధ్య తా భావాన్ని, సేవా తత్వాన్ని పెంపొందించే దిశగా ఒక ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

గురు నానక్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ మరియు ఛాన్సలర్ గగన్ డీప్ సింగ్ కోహ్లీ, మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ హెచ్‌ఎస్ సైనీ తమ సందేశంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఇలాంటి మానవతా దృక్పథం ఉన్న టువంటి కార్యక్రమంలో తమను కూడా భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.  అలాగే రక్తదానం చేసిన విద్యార్థులు, సిబ్బందిని అభినందించారు.