31-10-2025 02:06:02 PM
 
							చిట్యాల,(విజయక్రాంతి): భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను(Sardar Vallabhbhai Patel Jayanti Celebrations) చిట్యాల లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రం లో కనక దుర్గ సెంటర్ లో భారత మాజీ ఉప ప్రధాని, హోo మంత్రి, న్యాయవాది సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా అయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనoగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శ్రీను, బీజేపీ సీనియర్ నాయకుడు యానాలా శంకర్ రెడ్డి, ఎస్సీ మోర్చా కార్యదర్శి మాస శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకుడు, చికిలం మెట్ల అశోక్, కన్నె బోయన మహాలింగం, పల్లె వెంకన్న, బోడిగే అశోక్, కంచర్ల శంకర్ రెడ్డి, దామరోజు నాగరాజు, కన్నె బోయన మురళి తదితరులు పాల్గొన్నారు.