31-10-2025 12:02:17 AM
 
							హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ప్రీమియం ఈవెంట్ మేనేజ్‌మెంట్, బ్రాండ్ అనుభవ సంస్థ అయిన హైబిజ్ వన్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36, వెస్ట్‌ఎండ్ మాల్, 4వ అంతస్థులో తన కొత్త కార్పొరేట్ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించింది. కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి కిషన్‌రెడ్డి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హైబిజ్ వన్ ప్రయాణంలో నూతన శిఖరాలను అధిరోహించా లని కోరారు.
సుదీర్ఘ అనుభవంతో హైబిజ్ వన్ సంస్థ స్థాపించిన యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. సంస్థ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంధ్యా రాణి, సంస్థ చైర్మన్ రవి ఓహ్రిస్ మాట్లాడుతూ హైబిజ్ వన్, కార్పొరేట్, గవర్నమెం ట్, లైఫ్‌స్టుల్ విభాగాలలో ఎండ్-టు-ఎండ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ పరిష్కారాలను అం దించే ప్రముఖ సంస్థ అని తెలిపారు.
సమావేశాలు, బ్రాండ్ లాంచ్లు, అవార్డు వేడుకల నుంచి పెద్ద ఎత్తున పబ్లిక్ ఈవెంట్ల వరకు అన్ని కార్యక్రమాలను హైబిజ్ వన్ అద్భుతంగా నిర్వహిస్తుందని తెలిపారు. కార్యక్ర మంలో హైబిజ్ టీవీ వ్యవస్థాపకులు, ఎండీ మాడిశెట్టి రాజగోపాల్, భారతీ సిమెంట్స్ మార్కెంటింగ్ డైరెక్టర్ ఎం రవీందర్ రెడ్డి, ఏఆర్‌కు గ్రూప్ సీఎండీ రామిరెడ్డి, బొలినేని గ్రూప్ వ్యవస్థాపకులు బొలినేని శీనయ్య, శ్రీచక్ర మిల్క్ ఎండీ చేపూరి రావ్ మల్లికార్జున, ఎల్లారెడ్డిగూడ మాజీ ఎమ్మెల్యే సురేం దర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.