calender_icon.png 9 January, 2026 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలుంటే తెలియజేయాలి

07-01-2026 12:00:00 AM

రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్  

వరంగల్, జనవరి 6 (విజయక్రాంతి): జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు అవసరం ఉంటే సూచనలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ పట్టణాల పరిధిలో ముసాయిదా ఓటరు జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటికే గత డిసెంబర్ 31న డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసి అన్ని మున్సిపాలిటీల వారీగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు జరిపారని గుర్తు చేశారు. వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, వాటిని పారదర్శకంగా పరిష్కరించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,  మున్సిపల్ కమిషనర్లు సుధీర్ కుమార్, భాస్కర్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు బిజేపీ నుండి హరిశంకర్, ఏఐఎంఐఎం నుండి సయ్యద్ ఫైజుల్లా, వైఎస్సార్ సిపి నుంచి రజనీకాంత్, టిడిపి నుంచి శ్యామ్ సుందర్ పాల్గొన్నారు.