07-01-2026 12:00:00 AM
జహీరాబాద్, జనవరి 6 : బడుగు, బలహీన వర్గాలపై అగ్రవర్ణాలు దాడి చేస్తే చూ స్తూ ఊరుకోబోమని ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని సజ్జపూర్ గ్రామంలో మంగళవారం కోహిర్ మండలం సజ్జాపూర్ లోనీ అట్రాసిటీ బాధితులకు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావుతో కలిసి కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య నష్టపరిహారం అందించారు.
బేగరీ రాములు ఓటు వేయలేదని కక్షతో అతని నిర్మాణంలో ఉన్న ఇంటిని కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ జెసిబి సహాయంతో కూల్చివేయడం బాధాకరమని చైర్మన్ అన్నా రు. గ్రామంలో అశాంతి నెలకొనేందుకు కోహిర్ ఎస్త్స్ర నరేష్ కారణమని, బాధితుల ఫిర్యాదు తీసుకున్నడంలో నిర్లక్ష్యం వ్యవహరించిన ఎస్త్స్ర మూల్యం చెల్లించక తప్పదని చెప్పారు. గ్రామ కార్యదర్శి నికాస్ పవర్ దళితులపై కక్ష కట్టి వేధింపుల గురి చేయడం సరికాదని హెచ్చరించారు.
ఇద్దరు ప్రభుత్వ అధికారులపై కలెక్టర్ తో మాట్లాడి సస్పెండ్ కి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. గ్రామంలోని ప్రజలందరూ అన్నదమ్ముల వలె కలిసిమెలిసి, ఒకరినొకరు ఆప్యాయంగా, అనురాగంతో జీవించాలని సూచించారు. ఇల్లును కోల్పోయిన బేగరి రాములు అదే స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు భూమి పూజ చేశారు. ఎవరైనా అడ్డుపడ్డిపడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోహిర్ మాజీ జెడ్పిటిసి స్రవంతి అరవింద్ రెడ్డి, డి.ఎస్.పి సైదా నాయక్, సిఐ శివలింగం పాల్గొన్నారు.
కప్పాడ్‌లో...
జరసంఘం మండలంలోని కప్పాడులో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఎస్సీ అభ్యర్థి ప్రేమ్ ను అదే గ్రామానికి చెందిన అగ్రకుల వ్యక్తి సురేష్ బూతు మాటలు తిడితే దాడికి పాల్పడినట్టు ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఫిర్యా దు రాగా విషయం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడాలి..
జహీరాబాద్ టౌన్, జనవరి 6: ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉత్తమ చదువులు చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూ చించారు. మంగళవారం జహీరాబాద్ ము నిసిపాలిటీ పరిధిలోని రంజుల్ గ్రామంలో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేస్తే కఠినమైన శిక్షలు భరించాల్సి వస్తుందని హెచ్చరించారు. క్షేత్రస్థాయి అధికారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, కమిషన్ సభ్యులు రాములు, కళాశాల ప్రిన్సిపాల్ సృజన, మాల మహానాడు ప్రతినిధి ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.