calender_icon.png 9 January, 2026 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్లు వాహనాలు నడపొద్దు

07-01-2026 12:00:00 AM

కేసముద్రం, జనవరి 6 (విజయక్రాంతి): మైనర్లు వాహనాలు నడపద్దని, వారికి వాహనాలు ఇచ్చి కేసుల పాలు కావద్దని ఇనుగుర్తి ఎస్‌ఐ కరుణాకర్ తెలిపారు. మంగళవారం రాత్రి ఇనుగుర్తి మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మైనర్లు, ఇంకొందరు సెల్ఫోన్ మాట్లాడుతూ పోలీసులకు కనిపించారు. వారికి ఎస్‌ఐ కర్ణాకర్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వాహనాలను డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే నడపాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు.