29-08-2025 06:53:07 PM
గద్వాల: ప్రతి గ్రామంలో పంట కోత ప్రయోగాలు, డిజిటల్ క్రాప్ బుకింగ్, యూరియా సరఫరా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ సమావేశం హాల్ అందు భారత ప్రభుత్వము రూపొందించిన డిజిటల్ యాప్ ద్వారా పంట కోత ప్రయోగాలను నిర్వహించే విధానంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిజిటల్ యాప్ ద్వారా పంట కోత ప్రయోగాలను సరిగా నిర్వహించడం ఎంత ముఖ్యమో వివరించారు.
ప్రతి ప్రాథమిక కార్యకర్త (ఎంపిఎస్ఓలు, ఎఈఓలు) వారికి కేటాయించిన గ్రామాల్లో ఎటువంటి పొరపాట్లు లేకుండా పంట కోత ప్రయోగాలను నిర్వహించి,ఫలితాలను యాప్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని సూచించారు.అదేవిధంగా డిజిటల్ క్రాప్ బుకింగ్ సౌకర్యం ద్వారా రైతుల అవసరాలను తీర్చడం, ప్రతి గ్రామంలో అవసరమైన యూరియ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.