29-08-2025 06:47:43 PM
నిర్మల్,(విజయక్రాంతి): క్రీడలతోని సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని జిల్లా యువజన సర్వీసుల శాఖ అభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవం (మేజర్ ధ్యాన్ చంద్ జయంతి) సందర్బంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ నిర్మల్ ఆధ్వర్యంలో యన్.టి.ఆర్ మినీ స్టేడియం నిర్మల్ నందు జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. క్రీడల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో గత సంవత్సరం నిర్వహించిన సీయం కప్ నందు ప్రతిభ కనపరిచి పథకాలు సాధించిన క్రీడాకారులను సన్మానించడం జరిగినది.