calender_icon.png 29 August, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్ తగిలి పారిశుద్ధ్య కార్మికులకు తీవ్రగాయాలు

29-08-2025 08:49:27 PM

నకిరేకల్,(విజయక్రాంతి):  ప్రభుత్వ బాలికల పాఠశాలలో స్లాప్ మీద శుభ్రం చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి  మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు ముగ్గురు కి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం నకిరేకల్ పట్టణంలో చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం... నకిరేకల్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో వర్షాలు రావడంతో దుమ్ము ధూళి చెత్త చేదారం చేరడంతో శుభ్రం చేయడానికి మున్సిపాలిటీ పరిశుద్ధ కార్మికులు నల్లగొండ శోభ, వంచపాక నాగరాజు, వంటేపాక సబిత లు  స్లాప్  మీద శుభ్రం చేస్తుండగా  క్రమంలో కరెంటు తీగలు తగిలి ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులకు మొదట విద్యుత్ షాక్ కొట్టగా, వారిని కాపాడే ప్రయత్నంలో మూడో కార్మికుడికి షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.