29-08-2025 06:57:21 PM
నిజాంసాగర్,(విజయక్రాంతి): ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో వరద గేట్ల ద్వారా భారీ మొత్తంలో నీటి విడుదల చేశారు. వరద నీటిలో ముంపుకు గురవుతుందని ఉద్దేశంతో నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మర్పల్లి గ్రామస్తులను అచ్చంపేట సహకార సంఘ ఫంక్షన్ హాల్ లో వసతి కల్పించారు.
శుక్రవారం నాడు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వారికి పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు,నీళ్ల బాటిల్లను అందించి ఎవరు కూడా అధైర్య పడద్దని బాధితులకు భరోసాని చ్చారు. వరద ప్రభావం తగ్గే వరకు పునరావాస కేంద్రం లోనే ఉండాలని అయన సూచించారు. ఆయన వెంట బాన్సువాడ డి.ఎస్.పి విట్టల్ రెడ్డి, రూరల్ సీఐ తిరుపతయ్య, నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తదితరులు ఉన్నారు.