calender_icon.png 1 May, 2025 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంటాల జలపాతం వద్ద హరిత హోటల్ పరిశీలించిన కలెక్టర్..

26-04-2025 10:22:52 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల జలపాతం వద్ద నిర్మిస్తున్న హరిత హోటల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా(District Collector Rajarshi Shah) ఆకస్మికంగా పరిశీలించారు. జరుగుతున్న పనుల పురోగతి తీరుకు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ హాల్, కాటేజ్, స్విమ్మింగ్ పూల్, ఇంటర్నల్ సీసీ రోడ్స్ నిర్మాణ పనులపై ఈఈ ని అడిగి తెలుసుకొన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.