calender_icon.png 13 September, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డెక్కిన అన్నదాతలు

13-09-2025 02:47:24 AM

యూరియా కష్టాలు తీరేదెన్నడు?

  1. వర్షాకాలం పంటలకు దొరుకుతుందో లేదోనని ఆందోళన
  2. పలు చోట్ల నిరసనలు, రాస్తారోకోలు

నల్లగొండ, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి)/తుంగతుర్తి: వానాకాలం పంట లు వేసి రెండు నెలలు సమీపిస్తున్నా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా తిప్పలకు ముగింపు లేదా అంటూ పలువురు రైతులు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. అసలు వర్షాకాలం పంటలకు యూరియా దొరుకు తుందో, లేదోనని అన్నదాతలు ఆందోళనలో చెందుతున్నారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలకేంద్రంలో గత ఆరు రోజులుగా క్యూ కడుతున్నప్పటికీ యూరియా దొరకకపోవడంతో రైతులు శుక్రవారం నార్కట్‌పలి-అద్దంకి హైవేపై రాస్తారోకో చేశారు.

దీంతో రహదారికి ఇరువైపులా సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గత ఆరు రోజులుగా పనులన్నీ మానుకుని కు టుంబ సభ్యులమందరం యూరియా కో సం తెల్లవారుజామున 3 గంటల నుండి క్యూ లైన్లలో నిలబడుతున్నప్పటికీ యూరి యా మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వరి నాట్లు వేసి రెండున్నర నెలలు గడుస్తున్నా నేటికీ ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం లేదని వాపోయారు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తే తీరా పంటలకు యూరియా దొరకడం లేదని, ఇలా అయితే పంటలెలా పండుతాయని ప్రశ్నించారు. తహసీల్దార్ రామకృష్ణ, వ్యవసాయ అధికారి సన్నీ రాజు, ఎస్‌ఐ శంక ర్ నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. 

పలుకుబడితో పది బస్తాలు?

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని సహకార సొసైటీ కేంద్రంలో శుక్రవారం సహకార సొసైటీ కేంద్రానికి చెం దిన పలుకుబడి గల వ్యక్తి నలుగురు పేర్ల మీద, సుమారు పది బస్తాలు తీసుకొని, ఆటోలో వేశారు. ఇది గమనించిన స్థానిక రైతులు కోపోద్రిక్తులై పోలీసులపై తిరగబడి, దూశిస్తూ, ఆటోలో ఉన్న యూరియా బస్తాలను బయటకి లాగేశారు. అందులో కొన్ని బస్తాలు కూడా రైతులు ఎత్తుకొని వెళ్ళినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కొందరు రైతులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక వ్యవసాయ సంచాలకులు రమేష్ బాబు, ఒక్కొక్క రైతుకు పాసుబుక్కు ఆధార్ కార్డు ఉంటే, ఒక్కటి మాత్రమే ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ, సొసైటీ సిబ్బంది తుంగలో తొక్కి, యూరియా బస్తాలు పక్క దారిన పట్టిస్తున్నట్లు రైతులు ఆరోపించారు. జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ప్రతి రైతుకు ఒక్కొక్క యూరియా బస్తా, చేరే విధంగా కృషి చేయాలని స్థానిక రైతులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు కోరుతున్నారు.

కొట్టుకున్న మహిళా రైతులు

చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పట్టణ సొసైటీ, జంగరాయి సొసైటీ, చందంపేట సొసైటీ సెంటర్లలో శుక్రవారం రైతులు ఉదయం నుంచే క్యూలో నిలబడి టోకెన్లు తీసుకున్నారు. అందులో కొంతమందికే బస్తాలు అందాయి. చిన్నశంకరంపేట సొసైటీ వద్ద మహిళా రైతులు యూరియా కోసం కొట్టుకున్నారు. దీంతో పోలీసు బందోబస్తు నడుమ యూరియా పంపిణీ చేశారు. 

మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆధ్వర్యంలో నిరసన

మహబూబాబాద్(విజయక్రాంతి): కాం గ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగుకు అవసరమై న యూరియా ఇవ్వకుండా అరిగోస పె డుతోందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రైతుల పై మమకారం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. యూరియా కొరతను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా రాయపర్తి వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై వందలాది మంది రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పాలన లో పంట సాగుకు ముందే అవసరమైన యూరియా దిగుమతి చేసి నిల్వ ఉంచే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అందుకు భిన్నంగా రాష్ట్రంలో రైతులు యూరియా కోసమే రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రైతులకు అవసరమైన యూరియాను వెంటనే ఇప్పించాలని డి మాండ్ చేశారు. రాస్తారోకో వల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు వచ్చి ఎర్రబెల్లిని అరెస్టు చేశారు. 

టోకెన్ల క్యూలో చెప్పులు

గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో గజ్వేల్ మండల రైతు లు రాత్రి, పగలు తేడా లేకుండా క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గత ఐదు రోజులుగా మార్కెట్ యార్డులో  యూరియా టోకెన్లు పంపిణీ చేస్తుండటంతో రైతులు భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. టోకెన్ల పంపిణీకి ముందు రోజు అర్ధరాత్రి నుండే  శివుని కట్టడానికి మార్కెట్ కు చేరుకుంటున్నారు. గజ్వేల్ మార్కెట్ కమిటీలో శుక్రవారం టోకెన్ల కోసం అధిక సంఖ్యలో రైతులు తరలివచ్చారు.

కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో

కామారెడ్డి/నిర్మల్(విజయక్రాంతి): కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో శుక్రవారం రైతులు రోడ్డెక్కారు. తెల్లవారుజాము నుంచి క్యూ లైన్ కట్టిన రైతులకు యూరియా బస్తాలు అందలేదని ఆందోళన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల యూరియా బస్తాలు అందలేదని రైతులు ఆరోపించారు. నిర్మల్ జిల్లాలోని కడెం, దస్తురాబాద్, లక్ష్మణ చందా, నిర్మల్ రూలర్, లోకేశ్వరం, ముధోల్ మండలాల్లో యూరియా లారీలు రావడంతో దుకాణాల వద్ద రైతులు బారులు తీరారు. ఒక్కొక్కరికి ఒక బస్తానే ఇవ్వడంపై రైతులు మండిపడ్డారు. 

మరిపెడలో ధర్నా 

మరిపెడ(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఖమ్మెేంవరంగల్ జాతీయ రహదారిపై రైతులు శుక్రవారం ధర్నాకు దిగారు. రోజూ వారిగా మరిపెడ పీఏసీఎస్ వద్ద యూరియా బస్తాలు పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం యూరియా కోసం రైతులు అక్కడికి చేరుకోగా.. యూరియా లారీలు రావట్లేదని సిబ్బంది తెలపడంతో రైతులు ఆగ్రహించి మరిపెడ సెంటర్ పెట్రోల్ బంకు వద్ద రహదారిపై ధర్నా చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని యూరియా ఇప్పిస్తామని రైతులకు నచ్చజెప్పి మరిపెడ పీఏసీఎస్ సొసైటీ గోదాముకు పంపారు. యూరియా లారీని రప్పించి సీఐ, ఎస్సై అక్కడే ఉండి పంపిణీ చేయించారు.

యూరియా కొరతకు కేంద్రమే కారణం

  1. మా సర్కార్‌పైనే బీజేపీ నిందలు
  2. మంత్రి వాకాటి శ్రీహరి 

నిజామాబాద్ (విజయక్రాంతి): రాష్ర్టంలో యూరియా కొరతకు కేం ద్ర ప్రభుత్వమే కారణమని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి విమ ర్శించారు. నిజామాబాద్ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యా ల యంలో శుక్రవారం మంత్రి మీడి యా సమావేశంలో మాట్లాడారు. రా ష్ట్రానికి సరిపడా యూరియా పం పకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చే స్తూ, రేవంత్ సర్కారుపై అప్రతిష్ట పా లు చేయడానికి కక్ష్య సాధింపునకు పా ల్పడుతోందన్నారు.

రైతుల యూరి యా సమస్యపై రాష్ర్టంలోని బీజేపీ నా యకులకు చీమకుట్టినట్లయినా లేదని వారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. యూరియా బస్తాలు పంపాలని పలుమార్లు కేంద్రానికి విన్నపం చేసినప్ప టికీని అడపాదడపా యూరియా పంపుతూ ఇక్కడి రైతులను కేంద్రం ఇబ్బంది పెడుతోందని చెప్పారు. కాగా కామారెడ్డిలో నిర్వహించబోయే సభ ద్వారా మరిన్ని సంక్షేమ పథకాలపై ప్రకటన చేస్తామని మంత్రి తెలిపారు.