13-09-2025 02:32:47 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా? అం టూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని ఉద్దేశించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఎక్స్‌లో పోస్టుచేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినప్పటి ఫొటోలను షేర్ చేశారు. ఫొటోల్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్లను రాహుల్‌గాంధీ గుర్తు పడతారా?.. ఢిల్లీలో వారు రాహుల్‌ను కూడా కలిశారని గుర్తుచేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని అంటున్నారని, అది కాంగ్రెస్ కండువా కాదా? అని ప్రశ్నించారు.
ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా? అని రాహుల్‌గాంధీ అంగీకరిస్తారా? ఇది ఓట్ చోరీ కంటే చిన్న అంశమా అని నిలదీశారు. హైదరాబాద్‌లో ఓ చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయిన ఘటనపై కేటీఆర్ స్పందించా రు. ‘రాష్ట్రంలో సర్కార్ నడుపుతున్నారా? లే క సర్కస్ నడుపుతున్నారా?’ అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అదృష్టవశాత్తూ చిన్నారి ప్రాణాలు దక్కాయని పేర్కొన్నారు. ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని అభిప్రాయపడ్డారు.
చేసిన తప్పును దిద్దుకోవాల్సిన ము న్సిపల్‌శాఖ పరిధిలోని విభాగాలేమో ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటున్నాయని దు య్యబట్టారు. ‘తప్పు హైడ్రాది’ అని జీహెచ్‌ఎంసీ ప్రకటించిందని, వెనువెంటనే ‘తప్పు మాది కాదు.. జలమండలిది’ అని హైడ్రా చేతులు దులుపుకొన్నదని తెలిపారు. మళ్లీ జలమండలి మండలి స్పందిస్తూ.. మరో విభాగానిదే బాధ్యత అని తెలిపిందని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కాసుల వేటలో బిజీగా ఉంటే, మున్సిపల్‌శాఖలోని మూడు విభాగాలు మాత్రం సమన్వయలేమితో నగరవాసులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నా యని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చోటే భాయ్ రేవంత్‌రెడ్డికి బడే భాయ్ పార్టీ బీజేపీ పహారా..
చోటే భాయ్ రేవంత్‌రెడ్డిని చీమైనా కుట్టకుండా బడే భాయ్ పార్టీ బీజేపీ పహారా కాస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రప్రజలకు ఎన్ని సమస్యలొచ్చినా, సీఎం కుంభకోణాలకు పాల్పడినా బీజేపీ పట్టించు కోలేదన్నారు. శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పం దించారు. గ్రూప్ 1 నిర్వహణలో ఘోరమైన అవకతవకలు జరిగి ఏకంగా పరీక్షనే రద్దు చేయాలని హైకోర్టు చెప్పినా, బీజేపీ కిమ్మనలేదని ఎద్దేవా చేశారు.
విద్యార్థుల భవిష్య త్తును ప్రశ్నార్థకం చేసిన ప్రభుత్వంపై, ప్రభు త్వ పెద్దలు డబ్బులకు జాబులు అమ్ముకున్నారన్న ఆరోపణలపై బీజేపీ మౌనానికి కార ణమేంటని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హ యాంలో ప్రతి విషయానికి సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలు, ఇప్పుడు గ్రూప్ 1 స్కాంపై అదే విచారణ ఎందుకు కోరడం లేదని నిలదీశారు. ఇవన్నీ సీఎంకి, -బీజేపీ రహస్య మైత్రికి ఉదాహరణలని పేర్కొన్నారు.