calender_icon.png 13 September, 2025 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు వెనక్కి తిప్పు తాతయ్యా!

13-09-2025 03:45:39 AM

నా మనుమరాలు శ్రేష్ఠ అమెరికాలో పుట్టినప్పటికీ రెండు న్నరేళ్లు నా దగ్గరే పెరిగింది. శ్రేష్ఠను అపురూపంగా పెంచింది # నా అర్ధాంగి ప్రమీ ల. పెంచింది ఆమె ఐనా నా మనుమరాలి కి బాడీగార్డ్‌గా ఉన్నది నేనే. చక్కగా తెలుగు పదాలు ఉచ్చరిస్తున్న సందర్భంలోనే శ్రేష్ఠ తల్లిదండ్రులు వచ్చి అమెరికాకు తీసుకొని వెళ్లారు. ఇప్పుడామె ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడుతుంది. కానీ తెలుగు మరిచిపోలేదు. మరిచిపోకుండా చేసినందుకు నా కూతురు శ్రావణిని అభినందిం చకతప్పదు. నేను ఇప్పటికే నాల్గుసార్లు అమెరికా చూసి వచ్చాను.

నా మనుమరాలు చక్కగా తెలుగులో మాట్లాడుతుంటే నాకెంతో ముచ్చటేసింది. బాల్యంలో హైదరాబాదులో ఒకసారి శ్రేష్ఠను రవీంద్ర భార తికి నృత్యకార్యక్రమానికి తీసుకొని వెళ్తే గురువుగారు సినారే ముచ్చటపడి ఆమె ను ఎత్తుకున్న సంఘటనను ఇప్పటికీ మరిచిపోలేను. చాలా మంది తమ భాష అమె రికన్ ఇంగ్లీషనే భ్రమలో ఉన్నారు. కానీ శిశువు ఏ తల్లి గర్భం నుంచి ప్రపంచం (అది అమెరికా కావచ్చు, చైనా కావచ్చు)లోకి అడుగుపెట్టినా ఆ కన్నతల్లి భాషే ఆ మె మాతృభాష! నేను హాలివుడ్డులో తిరుగుతున్నప్పుడు నా మదిలో తట్టిన భావాల ను ఒక ముత్యాల సరంలో బంధించాను.

హాలివుడ్డే అందమైనది

ఐసుక్రీమే తియ్యనైనది

కన్నతల్లి గొప్పనైనది

మాతృభాష కమ్మనైనది

ఈ  గేయ పంక్తులను అమెరికాలో శ్రేష్ఠ పాడుతుంటే నాకు భలే సరదాగా ఉండేది. ఆమెతో పాటు ఆమె స్నేహితులు చదువుతుంటే నా జన్మ ధన్యమైనంతగా భావించి నాను. నా కూతురు శ్రావణి అమెరికాలో ఉన్నప్పటికీ మాతృభాషను మరవలేదు. ‘సిలికానాంధ్ర’ వారి పుణ్యమా అని ‘మనబడి’ కేంద్రాల్లో మా అమ్మాయి ఐదేళ్లు తె లుగు బోధించింది. నేను తెలుగు పండితుడినైనందుకు నా కోరిక ఫలించింది. ఒక సారి నేనామె క్లాసులో ఉండగా ప్రవేశించాను. ఆమె కోరిక మేరకు క్లాసు చివర్లో పాల్గొన్నాను. అప్పటికే డాక్టర్ ఆలపాటి వెంకట్ మరియు వారి సతీమణి నాకు ‘పూలగుత్తి’ని ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాదు మా అమ్మాయి వారి ఇద్దరు పిల్లలకు తెలుగు చెప్పినందుకు ధన్యావాదాలు చెప్పినారు. నేను 40 ఏళ్లు నా పుట్టిన రాష్ర్టంలో తెలుగు అధ్యాపకునిగా ఉంటే, నా కూతురు ఒక ఐదేళ్ల పాటు అమెరికాలో ‘మన బడి’లో తెలుగు ఉపాధ్యాయినిగా పని చేసిందంటే చెప్పలేనంత ఆనందం కల్గింది. నిజంగా నా వారసురాలనిపించింది.

ఆలపాటితో స్నేహబంధం

ఆమె ఆలపాటి వెంకట్ పిల్లలకు తెలు గు చెప్పడం వల్ల నాకు లాభం కల్గింది. అది 2020 సంవత్సరం. కరోనా మొదలు కావడానికి ముందే అమెరికాకు వెళ్లాను. రావడానికి కూడా టికెట్టు కొన్నాను కాబ ట్టి ఆర్నెళ్లు ఉండాల్సి వచ్చింది. నిజంగా ఆ ఆర్నెళ్లు నాకు బంధిఖానాలో ఉండిన అనుభూతి కల్గింది. 

అంతకుపూర్వం డాక్టర్ ఆ లపాటి వారు 2015లో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన నాట్స్ మహాసభలకు నన్నాహ్వానించారు. నాచేత అంతర్జాతీయ వేదిక మీ ద మొదటిసారి ఉపనిషత్తుల గురించి మా ట్లాడించినవారు వారే. ఆ సభల ద్వారా పరిచమైనమైన, నా కూతురు శ్రావణి వల్ల ఇంకా నాకు అత్యంత సన్నిహితులయ్యా రు. వారు సైకాలజీ డాక్టరు. కరోనా సమయంలో నేను గాభరాపడినప్పుడల్లా నాకు ధైర్యం చెప్పిన మహానుభావులు వారే! డాక్టర్ల ప్రిస్కిప్షన్ ఉంటేగాని అమెరికాలో మందులు దొరకవు.

మన దేశంలోలాగా అక్కడ నకిలీ మందులు అమ్మబడవు. మ రి కరోనా సమయంలో నేను భయపడినప్పుడు ధైర్యం చెప్పిన ఆలపాటి వారే నా శరీరస్థితిని గూర్చి చెప్పినప్పుడు వారు ఆరోగ్యానికికనుగుణంగా మరొక డాక్టర్ ద్వారా ప్రిస్కిప్షన్ తెప్పించుకొని, నాకు మందులందజేసినారు. నాకు సర్దిచేసినా, వేడి చేసినా, గొంతునొప్పికల్గినా, ఆయా సం కల్గినా, అన్నం రుచించకపోయినా మనస్తాపానికి గురి అయ్యేవాణ్ణి. ఐతే నా పరిస్థితికి నా అల్లుడు నాగరాజు, కూతురు శ్రావణి నవ్వుకునేవారు.

‘మేం ఇక్కడ అదే పనిగా మందులు వాడము. నీకిక్కడ మందులు తెచ్చే వారెవ్వరూ లేరు’ అని భయపెట్టేవారు. అందువల్లే నేను మరింత తాపానికి గురయ్యేవాణ్ణి. కానీ డాక్టర్ ఆలపాటి వెంకట్ గారు మనస్తత్వ వైద్యులు కనుక ధైర్యంతో పాటు మందులు తెచ్చి ఇచ్చినారు. వారు మందులు తెచ్చి ఇచ్చినప్పుడు చూసిన మా కూతురు ‘ఇక్కడ ఎవరినీ ఏమీ అడగరాదు ’ అని శాసనం చేసింది. కాని నేను సర్దిచెప్పేవాణ్ణి.  ఐనా నాకు ఆలపాటికి మధ్య మైత్రి ఆగలేదు.

శ్రేష్ఠకు అభినందనలు

ఎలాగైతేనేమి మా అమ్మాయి తెలుగు చెప్పడం వల్ల, ఆలపాటి పిల్లలతో పాటు మా ఇద్దరు మనవరాళ్లు చదువుకున్నారు. అట్లా ఆ రెండు కుటుంబాల మధ్య స్నే హం ఏర్పడటంతో పాటు, నాకు ఆలపాటికి మధ్య స్నేహం కుదిరింది. నేను వయస్సులో పెద్దవాణ్ణి కనుక డాక్టర్ ఆలపాటి నన్ను బాబాయి గారని’ పిలిచేవారు.

వారు కరోనా సమయంలో చేసిన ఉపకారాన్ని గుర్తుపెట్టుకొని వారికి ‘ఆచార్య చెన్న ప్ప అమెరికా ముచ్చట్లు’ అనే యాత్రా చరిత్ర గ్రంథాన్ని అంకితం చేశాను. లోకం లో ఎవరికైనా జ్ఞానం పుస్తకాలు చదవడం వల్లనే కాక, ఇతరులతో స్నేహం చేయడం వల్ల కూడా కలుగుతుంది. ఇతరులను అ నుకరించి జ్ఞానం పొందే అవకాశం కూడా ఉంది. ఏ భాష మాట్లాడేవారితో కలిస్తే ఆ భాష వస్తుందనే వాదం సరైంది. హైదరాబాదులో కంటే, అమెరికాలో ఆలపాటి పిల్లలూ, మా శ్రావణి పిల్లలూ నా ముం దు తెలుగులో ఎంత చక్కగా మాట్లాడగలరో ఆంగ్లంలోనూ అంతే చక్కగా మా ట్లాడగలరు.

భాష అంటే భాషింపబడేదే కాదు, విని నేర్చుకునేది. మన దేశంలోని రూల్స్ కంటే అమెరికాలో రూల్స్ కఠినంగా ఉంటాయి. రోడ్డు మీద ప్రయాణం చేసేవారు రూల్సు పాటించవలసిందే, లే దా  ఫైన్ కట్టవలసిందే. అమెరికాలో ఉన్నవారికి గాని, అక్కడే పుట్టిన వారికి గాని అ మెరికా నియమ నిబంధనలు చిన్నప్పటి నుంచే అవగతమవుతాయి. రూల్సుకు భి న్నంగా పోతే శిక్షలనుభవించవలసిందే. అ ప్పటికి మా శ్రేష్ఠకు పన్నెండేళ్ల వయస్సు. తల్లిదండ్రులతో పాటు హైదరాబాదుకు వచ్చింది. తాతయ్యంటే ప్రేమ కాబట్టి, ఆ మెను నేనే నా కారులో ఎక్కించుకొని నగరంలో తిప్పేవాణ్ణి.

ఒకరోజు ప్రయాణంలో ఒక అరటి పండిచ్చి తినమన్నాను. తిన్న తర్వాత అరటిపండు తోలును చేతిలోనే ప ట్టుకుంది. బయట పారెయ్యి అన్నాను కారు డోరు తెరిచి. అట్లా పడెయ్యను. డస్ట్‌బిన్ చూపెడితే పరేస్తానన్నది. ‘ఇక్కడెక్కడా డస్ట్‌బిన్లు ఉండవమ్మా’ అన్నాను. ‘ఐతే ఇది నా చేతిలోనే ఉంటుంది. మన ఇంటికి వె ల్దాం. కారు వెనక్కి తిప్పు తాతయ్యా’ అం ది. నాకు మతిపోయినంత పనైంది. రోడ్డు మీద చెత్త కాగితాన్ని గాని, అరటితొక్కను గాని పడేస్తే ఫైన్ కట్టవలసి వస్తుందన్న భయమే ఆమెనలా చేసింది. క్రమశిక్షణ అనేది బాల్యం నుంచే అలవడితే అందరికీ మంచిదనే అభిప్రాయం చేతల్లో చూపిన శ్రేష్ఠకు అభినందనలు చెప్పకుండా ఉండలేకపోయాను.