16 April, 2026 | 9:05 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కలెక్టర్

20-06-2025 12:55 AM

టేక్మాల్, జూన్ 19 : టేక్మాల్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల స్థలాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. గురువారం టేక్మాల్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు. 

ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదవారి ఇంటి నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఈ పథకం జిల్లాలో క్షేత్రస్థాయిలో పనులు వేగంగా పురోగతిలో ఉన్నాయని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారని,  ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చుటకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉంటూ పనులు నిర్వహిస్తున్నారన్నారు.

ప్రత్యేక అధికారులు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు వార్డు అధికారులు హౌసింగ్ రెవెన్యూ పంచాయతీరాజ్ సిబ్బందితో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యాలను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయుటకు కృషి చేయాలనిఆయనకోరారు.