16 April, 2026 | 7:23 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఎండు గంజాయి, మద్యం బాటిళ్ల పట్టివేత

20-06-2025 12:58 AM

మునిపల్లి, జూన్ 19 : ఎండు గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు చేసి అతని వద్ద 450 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్న వివరాలు ఇలావున్నాయి. జిల్లా అసిస్టెంట్ ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారి మన్నెన్న ఆదేశాల మేరకు  టాస్క్ఫోర్స్ సిబ్బంది మునిపల్లి మండల కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలో భాగంగా పటాన్చెరు మండలం ఇంద్రేశంకు చెందిన కంచె రాకేష్ అక్రమంగా ఎండు గంజాయిని స్కూటీ పై సరఫరా చేస్తుండగా అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి (450) గ్రాముల ఎండు గంజాయిని, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ కి తరలించారు.

అదే విధంగా గోవా నుండి వచ్చే వాహనాలను తనిఖీ  చేస్తుండగా వివిధ బ్రాండ్ లకి సంబంధించిన 5.450 లీటర్ల సుంకం చెల్లించని మద్యంను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడులలో జిల్లా టాస్క్ ఫోర్స్ స్టేషన్  టీం సీఐ శంకర్, ఎస్త్స్రలు హనుమంతు, సతీష్, సిబ్బందిఉన్నారు.