3 July, 2026 | 1:00 AM

కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్

03-07-2026 12:00 AM

సిబ్బందిపై ఆగ్రహం

బోధన్, జూలై 2 (విజయక్రాంతి): రెంజల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలోని పరిసరాలను, కిచెన్, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండి అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థినులు పాములు, విష కీటకాల బారినపడితే ఎవరు బాధ్యులని నిలదీశారు. వెంటనే పరిసరాలను శుభ్రం చేయించాలని, వర్షపు నీరు నిలువ ఉన్న గుంతలలో దోమలు వృధ్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయాలని ఆదేశించారు. సిబ్బంది అటెండెన్స్, మధ్యాహ్న భోజనం మెనూ వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.